ఫ్యూచర్‌కు మరో ఎదురు దెబ్బ.. ఈసారి వడ్డీ రూపంలో

19 May, 2022 19:23 IST|Sakshi

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఎఫ్‌ఈఎల్‌) తాజాగా రూ. 23 కోట్ల నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్లకు సంబంధించి రూ. 1.06 కోట్ల వడ్డీని చెల్లించడంలో విఫలమైనట్లు తెలిపింది. మే 17న దీన్ని చెల్లించాల్సినట్లు పేర్కొంది

గత మూడు నెలల్లో ఫ్యూచర్‌ గ్రూప్‌ పలు చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి 31 నాటికి బ్యాంకులకు రూ. 2,836 కోట్ల చెల్లింపులో కూడా విఫలమైనట్లు ఎఫ్‌ఈఎల్‌ గత నెల స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసింది.

 ఫ్యూచర్‌ గ్రూప్‌లోని 19 సంస్థలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ రిటైల్‌ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ  వివిధ కారణాల వల్ల ఆ డీల్‌ సాకారం కాలేదు.   
 

మరిన్ని వార్తలు