రిలయన్స్ జోరుకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్

3 Feb, 2021 11:18 IST|Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌తో రూ.24,718 కోట్ల ఒప్పందం విషయంలో యథాతథ పరిస్థితిని కొనసాగించాలని ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌)ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తన రిటైల్ ఆస్తులను రిలయన్స్‌ సంస్థకు అమ్మాలనుకుంటున్న ఫ్యూచర్ గ్రూప్ ప్రయత్నాలకు ఢిల్లీ హైకోర్టు బ్రేకులు వేసింది. అమెజాన్‌ హక్కుల పరిరక్షణకు తక్షణ మధ్యతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆ సంస్థ వాదనలతో కోర్టు సంతృప్తి చెందుతున్నట్లు జస్టిస్‌ జేఆర్‌ మిద్రా పేర్కొన్నారు. “ఎఫ్‌ఆర్‌ఎల్‌సహా ఇతర ప్రతివాదులు అందరూ మంగళవారం సాయంత్రం 4.49 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు ఇస్తున్నాం” అని జడ్జి రూలింగ్‌ ఇచ్చారు.(చదవండి: అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం)

వరుసగా నాలుగురోజుల నుంచీ ఈ అంశంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ప్యూచర్‌ రిటైల్‌ వ్యాపారాలను రిలయన్స్‌తో విక్రయించడం సరికాదంటున్న అమెజాన్‌, ఇంతక్రితమే ఇందుకు సంబంధించి తమ తొలి కొనుగోలు హక్కులకు వీలు కలిగిస్తున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తోంది. తదుపరి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సింగపూర్‌. ఆర్బిట్రల్‌ ఉత్తర్వుల అమలుకు ప్యూచర్‌ రిటైల్‌ను ఆదేశించాలని అమెజాన్‌ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై అమెజాన్‌ హర్షం వ్యక్తం చేసింది. అయితే చట్టబద్దంగా తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు ఫ్యూచర్‌ రిటైల్‌ వెల్లడం.

మరిన్ని వార్తలు