ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌- రిటైల్‌.. పతనం

3 Aug, 2020 14:00 IST|Sakshi

క్యూ4 ఫలితాల ఎఫెక్ట్‌

ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ 

అదే బాటలో 5 శాతం పడిన ఫ్యూచర్‌ రిటైల్‌ 

గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో కిశోర్‌ బియానీ గ్రూప్‌ కంపెనీ ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ ప్రభావంతో గ్రూప్‌లోని మరో కీలక కంపెనీ ఫ్యూచర్‌ రిటైల్‌ కౌంటర్‌ సైతం అమ్మకాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం..

డౌన్‌ డౌన్‌
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌ షేరు 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 5.75 కోల్పోయి రూ. 109 వద్ద ఫ్రీజయ్యింది. ఈ బాటలో కొనుగోలుదారులు కరువుకావడంతో ఫ్యూచర్‌ రిటైల్‌ షేరు సైతం 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌లో ఫ్రీజయ్యింది. రూ. 5.50 నష్టంతో రూ. 105 దిగువన నిలిచింది. 

క్యూ4 వీక్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ రూ. 149 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 75 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 4.5 శాతం పెరిగి రూ. 1443 కోట్లకు చేరింది. 

మరిన్ని వార్తలు