ఇంట్లోనే ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌ చేసే అదిరిపోయే గాడ్జెట్స్‌.. ధర ఎంతంటే?

8 Jan, 2023 11:40 IST|Sakshi

పర్యావరణానికి అతిపెద్ద బెడద ప్లాస్టిక్‌ చెత్త. ప్లాస్టిక్‌ చెత్త సమస్య పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. వాటిలో భాగమే ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌. ఇప్పటివరకు ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ భారీగా పారిశ్రామిక స్థాయిలోనే అరకొరగా జరుగుతోంది. అయితే, ఇంటిపట్టునే ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేసే యంత్రం తాజాగా అందుబాటులోకి వచ్చింది.

అమెరికన్‌ బహుళజాతి సంస్థ ‘క్లియర్‌డ్రాప్‌’ ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేసే ‘సాఫ్ట్‌ ప్లాస్టిక్‌ కాంపాక్టర్‌’ను రూపొందించింది. వాషింగ్‌ మెషిన్‌లా కనిపించే ఈ యంత్రంలో ప్లాస్టిక్‌ సంచులు వంటి మెత్తని ప్లాస్టిక్‌ చెత్తను పడేసి, స్విచాన్‌ చేస్తే, నిమిషాల్లోనే రీసైక్లింగ్‌కు పనికొచ్చే ఇటుకలుగా తయారు చేస్తుంది.

ఈ యంత్రం పనిచేసేటప్పుడు ఎలాంటి పొగ వెలువడదని, దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని తయారీదారులు చెబుతున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్‌లోకి రానుంది. ధరను ఇంకా ప్రకటించలేదు. 

మరిన్ని వార్తలు