సస్పెన్షన్‌లో రంగనాథన్‌: గెయిల్‌

20 Jan, 2022 02:47 IST|Sakshi

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్‌ చేసిన సంస్థ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రంగనాథన్‌ను సస్పెండ్‌ చేసినట్లు ప్రభుత్వ రంగ గ్యాస్‌ యుటిలిటీ సంస్థ– గెయిల్‌ (ఇండియా) ధ్రువీకరించింది. ప్రైవేటు కంపెనీలకు పెట్రోకెమికల్‌ ప్రొడక్టుల అమ్మకాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తూ లంచాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రంగనాథన్‌ను రెండు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో ఆరుగురిని కూడా సీబీఐ అరెస్ట్‌ చేసింది.

రంగనాథన్‌సహా పలువురి నివాసాలపై జరిగిన సీబీఐ దాడుల్లో దాదాపు రూ.1.25 కోట్లు డబ్బు, అంతే మొత్తం విలువైన ఆభరణాలు, కొన్ని కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ‘గెయిల్‌ ఎంప్లాయీస్‌ (కాండక్ట్‌ డిసిప్లిన్‌ అండ్‌ అప్పీల్‌) రూల్స్, 1986లోని రూల్‌ 25 ప్రకారం దాఖలైన అధికారాలను అమలు చేస్తూ ఈఎస్‌ రంగనాథన్‌ను 2022 జనవరి 18వ తేదీ నుంచి అమలయ్యేలా సస్పెండ్‌చేస్తూ భారత్‌ రాష్ట్రపతి  నిర్ణయం తీసుకున్నారు’’ అని గెయిల్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  

మరిన్ని వార్తలు