గంగవరం పోర్టు రికార్డ్‌!

8 Sep, 2021 09:08 IST|Sakshi

హెదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సరుకు రావాణాలో ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్ట్‌ కొత్త రికార్డులను నమోదు చేసింది. మొబైల్‌ హార్బర్‌ క్రేన్స్‌ను ఉపయోగించి 24 గంటల వ్యవధిలో ఏకంగా 26,885 మెట్రిక్‌ టన్నుల ఎరువులను పోర్ట్‌ స్వీకరించింది. గతంలో ఈ రికార్డు కింద 16,690 టన్నులు మాత్రమే నమోదైంది. 64,575 మెట్రిక్‌ టన్నుల యూరియాను అందుకుంది. 24 గంటల్లో 23,500 మెట్రిక్‌ టన్నుల దుక్క ఇనుము, 46,700 మెట్రిక్‌ టన్నుల ఇనుము ధాతువు గుళికలు పోర్ట్‌ నుంచి సరఫరా అయింది.

ఆగస్ట్‌ నెలలో కన్వేయర్స్‌ ద్వారా వైజాగ్‌ స్టీల్‌కు 6,08,706 మెట్రిక్‌ టన్నుల బొగ్గు రవాణా చేశారు. నౌకాశ్రయం అత్యున్నత మౌలిక సదుపాయాలు, కార్యాచరణ సామర్థ్యానికి ఇది నిదర్శనమని గంగవరం పోర్ట్‌ ఈడీ జి.జె.రావు తెలిపారు.    

చదవండి : HUL Price Hike: ఇక ఇప్పుడు సబ్బులు, డిటర్జెంట్‌ల వంతు

మరిన్ని వార్తలు