గార్ట్‌నర్‌ నివేదికలో తాన్లా ప్లాట్‌ఫామ్స్‌

25 Nov, 2021 10:18 IST|Sakshi

హైదరాబాద్‌: సీపాస్‌ (కమ్యూనికేషన్స్‌ ప్లాట్‌ఫాం యాజ్‌ ఎ సర్వీస్‌) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ తాజాగా ప్రతిష్టాత్మక గార్ట్‌నర్‌ నివేదికలో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయంగా సీపాస్‌ మార్కెట్‌ తీరుతెన్నులపై రూపొందించిన ’కాంపిటీటివ్‌ ల్యాండ్‌స్కేప్‌ ఫర్‌ కమ్యూనికేషన్స్‌ ప్లాట్‌ఫామ్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ 2021’ నివేదికలో తాన్లా గురించి, కంపెనీకి చెందిన వైజ్‌లీ సొల్యూషన్‌ ప్రత్యేకతల గురించి గార్ట్‌నర్‌ ప్రముఖంగా ప్రస్తావించింది.

అంతర్జాతీయంగా ఎనిమిది దిగ్గజ సీపాస్‌ కంపెనీలు, వాటి పరిమాణం, అవి ఆఫర్‌ చేసే సర్వీసులు, మార్కెట్‌ వైవిధ్యం, ట్రెండ్‌లు మొదలైన వాటి అధ్యయనం ఆధారంగా ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. తమ సొల్యూషన్స్‌ విశ్వసనీయత, భద్రతకు గార్ట్‌నర్‌ నివేదిక తాజా నిదర్శనం అని తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ చైర్మన్‌ ఉదయ్‌ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు.   
 

మరిన్ని వార్తలు