Adani Group: రానున్న పదేళ్లలో100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి: అదానీ

27 Sep, 2022 15:48 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రపంచంలోనే మూడో  అంత్యంత సంపన్న బిలియనీర్‌ గౌతమ్ అదానీ రానున్న  దశాబ్ద కాలంలో   ఇండియాలో భారీ  ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నారు. పదేళ్లలో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడతామని తాజా వెల్లడించారు. న్యూ పవర్‌  ఎనర్జీ, డేటా సెంటర్లు లాంటి  రంగాలలో  ఈ పెట్టుబడులుంటాయని తెలిపారు.

సింగపూర్‌లో జరిగిన గ్లోబల్ సీఈఓల కాన్ఫరెన్స్‌లో అదానీ మాట్లాడుతూ, అదానీ  గ్రూపుగా వచ్చే దశాబ్ద కాలంలో  100 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నా మన్నారు. ముఖ్యంగా ఈ పెట్టుబడిలో 70 శాతం ఇంధన పరివర్తన రంగానికి కేటాయించినట్టు  ఆయన వెల్లడించారు.  ప్రస్తుత 20  గిగా వాట్ల పునరుత్పాదక పోర్ట్‌ ఫోలియోతో పాటు, 45 గిగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని తీసుకొస్తా మన్నారు.  ఇది 100,000 హెక్టార్లలో విస్తరించి, సింగపూర్ వైశాల్యం కంటే 1.4 రెట్లు ఎక్కువ. 30 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ కమర్షలైజేషన్‌కు తోడ్పడు తుందని అదానీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు