Global Index: అదానీ ర్యాంకు ఆక్రమించిన చైనా వ్యాపారి

17 Jun, 2021 16:40 IST|Sakshi

14 బిలియన్ల సంపద కోల్పోయిన గౌతమ్‌ అదాని

ఆసియా రెండో సంపన్నుడి స్థానం గోవిందా !  

ముంబై: నిన్నా మొన్నటి వరకు ఆసియాలోనే రెండో ధనవంతుడి స్థానం దక్కించుకున గౌతమ్‌ అదానీ తాజాగా ఆ స్థానం చేజార్చుకున్నారు. అదానీ గ్రూపుతో సంబంధం ఉన్న  మూడు కంపెనీలకు చెందిన బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్‌ అవడంతో ఒక్కసారిగా ఆయన సంపద ఆవిరైపోయింది. దీంతో అదానీని వెనక్కి నెట్టి చైనాకు చెందిన జాంగ్‌ షాన్‌షాన్‌ రెండో స్థానం దక్కించుకున్నారు. ప్రపంచంలో బిలియనీర్ల సంపదను ఎప్పటికప్పుడు అంచనా వేసే గ్లోబల్‌ ఇండెక్స్‌ తాజా జాబితా అదానికి షాక్‌ ఇచ్చింది.

ఆసియాలోనే అత్యంత ధనవంతులైన బిలియనీర్ల జాబితాలో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ప్రథమ స్థానంలో ఉండగా అనతి కాలంలోనే అదాని రెండో స్థానానికి చేరుకున్నారు. పోర్టు బిజినెస్‌లలో అదానీ గ్రూపు చూపిన దూకుడుతో ఆ కంపెనీ షేర్లు అనూహ్యంగా పెరిగాయి. అదాని గ్రూపులన్నీ కలిసి అతి తక్కువ కాలంలో వంది బిలియన్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మార్క్‌ని దాటాయి. అదానీ ప్రభ వెలిగిపోతున​ కాలంలో నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీపీ) ఇచ్చిన షాక్‌తో అదానీ స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి.

గత సోమవారం అదానీ గ్రూపుకి సంబంధించిన 3 కంపెనీల బ్యాంకు అకౌంటర్లను నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీపీ) సీజ్‌ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆయన సంపద 77 బిలియన్‌ డాలర్ల నుంచి 63 బిలియన్‌ డాలర‍్లకు పడిపోయింది. ఒక్క రోజు వ్యవధిలోనే 14 బిలియన్ల డాలర్ల సంపద ఆవిరైపోయింది.  

చదవండి : ClubHouse Vs FaceBook : ఎవరి మాట నెగ్గేను ?

మరిన్ని వార్తలు