Gautam Adani: వారెన్‌ బఫెట్‌కు భారీ షాక్‌! రికార్డులన్నీ తొక్కుకుంటూ పోతున్న అదానీ!

25 Apr, 2022 10:46 IST|Sakshi

వెలుగులు నింపే విద్యుత్‌ నుంచి వంటనూనె దాకా. పోర్ట్‌ల నుంచి వంట గ్యాస్‌ వరకు ఇలా ప్రతిరంగంలో తనదైన ముద్రవేస్తూ దూసుకెళ‍్తున్నారు. పట్టిందల్లా బంగారమే అన్నట్లు.. ప్రతి రంగంలోనూ అదానీకి విజయమే వరిస్తుంది. ఎక్కడైనా అవకాశం ఉంటే..అడ్రస్‌ కనుక్కొని వెళ్లి మరీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.అందుకే తనని అందుకోవాలనే ఆలోచన కూడా ప్రత్యర్ధులకు రానంతగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర‍్మించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ధనవంతుల జాబితాల్లో ఒక్కొక్కరిని వెనక్కి నెట్టేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే ఆసియా రిచెస్ట్‌ పర్సన్‌ జాబితాలో 6వ స్థానాన్ని దక్కించుకున్న ఆయన..తాజాగా మరో మైలురాయిని చేరుకున్నారు.

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ కథనం ప్రకారం..
గత శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ షేర్‌ వ్యాల్యూ పెరిగింది. అదే సమయంలో అదానీ ఆస్థుల విలువ 123.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో 121.7 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో 5వ స్థానంలో ఉన్న ఇన్వెస్ట్‌ మెంట్‌ మాంత్రికుడు వారెన్‌ బఫెట్‌ను వెనక్కి నెట్టారు. 5వ స్థానాన్ని  రెండేళ్ల క్రితం అదానీ ఆస్థుల విలువ 8.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అయితే ఇంతింతై వటుడింతయై అన్న చందంగా అదానీ షేర్ వ్యాల్యూ దేశీయ స్టాక్‌ మార్కెట్ లో రాకెట్‌ వేగంతో దూసుకెళ్లాయి. అలా మార్చి 2021 నుంచి మార్చి 2022 నాటికి అదానీ గ్రూప్‌ స్టాక్స్‌  90 బిలియన్‌ డాలర్లకు చేరింది. 

అంచనా ప్రకారం..భారత్‌లో అదానీ ఆ​స్థుల నికర విలువ 123.7 బిలియన్‌ డాలర్లతో దేశంలో అత్యంత ధనవంతుడిగా నిలబెట్టింది. ముఖేష్ అంబానీ నికర ఆస్థుల విలువ 104.7 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. అదానీని క్రాస్‌ చేసేందుకు ముఖేష్‌ అంబానీకి  19 బిలియన్ డాలర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక యూఎస్‌ మార్కెట్లో వారెన్‌ బఫెట్‌కు చెందిన బెర్క్‌ షైర్‌ హాత్వే షేర్లు శుక్రవారం రోజు 2శాతం పడిపోవడంతో.. ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 6వ స్థానానికి దిగజారినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ట్రాకర్ ప్రకారం..ఇప్పుడు వరల్డ్‌ వైడ్‌గా  అదానీ కంటే నలుగురు మాత్రమే ధనవంతులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ 130.2 బిలియన్ డాలర్లు, ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ కింగ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 167.9 బిలియన్ డాలర్లు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ డాలర్లు..స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్‌ మస్క్‌' లు 269.7 బిలియన్‌ డాలర్లతో కొనసాగుతున్నారు.

చదవండి👉 అదానీనా మజాకానా.. ముఖేష్‌ అంబానీకి భారీ షాక్‌..!

మరిన్ని వార్తలు