షాకింగ్‌ డెసిషన్‌పై మౌనం వీడిన గౌతం అదానీ: వీడియో

2 Feb, 2023 16:25 IST|Sakshi

సాక్షి,ముంబై: అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్‌ వివాద సునామీలో  అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ ఎప్‌ఫీవో కచ్చితంగా ఉండి తీరుతుందని ప్రకటించింది అదానీ.  ఈ మేరకు  ఎఫ్‌పీవో పూర్తిగా సబ్‌స్క్రైబ్  తరువాత కూడా  అనూహ్యంగా అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ ఎఫ్‌పీవో విషయంలో అదానీ గ్రూప్ వెనక్కి తగ్గింది. అతిపెద్ద 20000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్‌ను ఉపసంహరించుకున్నామంటూ అందరికీ షాకిచ్చింది. అయితే  ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి  ఇచ్చేస్తామని అదానీ గ్రూపు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

తాజా పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ తొలిసారి స్పందించారు. తాము తీసుకున్న నిర్ణయంపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మార్కెట్‌ వోలటాలీటీనేతమ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు. ఇన్వెస్టర్లు నష్టాలకు గురి కాకూడదనే షేర్ల విక్రయానికి పిలుపునివ్వాలని గ్రూప్ నిర్ణయించినట్లు అదానీ గురువారం తెలిపారు.

బుధవారం నాటి మార్కెట్ అస్థిరతను పరిగణనలోకి తీసుకుంటే, ఎఫ్‌పిఓతో కొనసాగడం నైతికంగా సరైనది కాదని బోర్డు గట్టిగా భావించిందని అదానీ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇది  అదానీ గ్రూప్ సంస్థల ప్రస్తుత కార్యకలాపాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగానూ ప్రభావితం చేయదంటూ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. తమ బ్యాలెన్స్ షీట్ బలంగానే ఉందని, సంస్థ రుణ బాధ్యతలను నెరవేర్చటంలో సంస్థకున్న ట్రాక్ రికార్డు కూడా బాగుందంటూ   ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు.

మరిన్ని వార్తలు