అదానీ తనయుడి ఎంగేజ్‌మెంట్‌, ముచ్చటైన జంట ఫోటో వైరల్‌

14 Mar, 2023 18:45 IST|Sakshi

సాక్షి, ముంబై:   ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. అదానీ  కుమారుడు జీత్ అదానీతో, వ్యాపారి సీ దినేష్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ అధినేత దివా జైమిన్ షా కుమార్తె దివాతో నిశ్చితార్థ వేడుక జరిగింది. మార్చి 12న ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ వేడుక జరిపించారు.  

ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటో ఒకటి  ఇపుడు హాట్‌ టాపిక్‌గా నిలిచింది.  జీత్‌, దివా  జంట చూడముచ్చటగా  ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సన్నిహితులు మధ్య ఈ నిశ్చితార్థ వేడుక  నిర్వహించినట్టు తెలుస్తోంది.  దీంతో సోషల్‌మీడియా వేదికగా  కాబోయే జంటకు అభినందనలు వెల్లువెత్తాయి. అయితే ఈ వేడుకపై ఇరు కుటుంబాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

గౌతం అదానీ చిన్నకుమారుడైన జీత్ అదానీయూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ నుండి తన చదువు పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రూప్ ఫైనాన్స్ వైస్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. అంతేకాదు జీత్ అదానీ ఒక ఔత్సాహిక పైలట్ కూడా.  గతంలో జీత్‌ తాను విమానం నడుపుతున్న చిత్రాన్ని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ తోటి పైలట్లు, వర్ధమాన ఆశావహులందరికీ ప్రపంచ పైలట్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక దివా తండ్రి జైమిన్ షా సీ దినేష్ అండ్ కో-ప్రైవేటు లిమిటెడ్ ప్రస్తుత డైకెర్టర్లలో జైమిన్ షా కూడా ఉన్నారు.

కాగా గౌతం అదానీ పెద్ద కుమారుడు కరణ్, న్యాయ సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ మేనేజింగ్ భాగస్వామి  సిరిల్ ష్రాఫ్ కుమార్తె పరిధి ష్రాఫ్‌ను పెళ్లాడారు. కరణ్ అదానీ అదానీ పోర్ట్స్ & సెజ్ లిమిటెడ్  సీఈవో, అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 

p>

మరిన్ని వార్తలు