ఏఎస్‌ఓఎస్‌ఏఐ చైర్మన్‌గా జీసీ ముర్ము

8 Sep, 2021 09:05 IST|Sakshi

న్యూఢిల్లీ:  సుప్రీం ఆడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అంతర్జాతీయ సంఘం (ఐఎన్‌టీఓఎస్‌ఏఐ) ప్రాంతీయ గ్రూప్‌లలో ఒకటైన అసెంబ్లీ ఆఫ్‌ ది ఆసియన్‌ ఆర్గనైజేషన్‌ (ఏఎస్‌ఓ ఆఫ్‌ ఎస్‌ఏఐ) చైర్మన్‌గా భారత్‌ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) జీసీ ముర్ము ఎంపికయ్యారు. ఆయన ఎంపిక విషయాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) ఒక ప్రకటనలో తెలిపింది. 2024 నుంచి 2027 వరకూ ఆయన ఏఎస్‌ఓఎస్‌ఏఐ చైర్మన్‌ బాధ్యతల్లో ఉంటారు.

56వ గవర్నింగ్‌ బోర్డు
కాగ్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం వియత్నాం రాజధాని హనోయ్‌లో జరిగిన ఏఎస్‌ఓఎస్‌ఏఐ 56వ గవర్నింగ్‌ బోర్డ్‌  జీసీ ముర్మును చైర్మన్‌గా ఎంచుకుంది. ఈ ఎంపికకు మంగళవారం  ఏఎస్‌ఓఎస్‌ఏఐ 15వ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.  ఏఎస్‌ఓఎస్‌ఏఐ 16వ అసెంబ్లీ సమావేశాన్ని 2024లో భారత్‌ నిర్వహిస్తున్నట్లు కూడా కాగ్‌ వెల్లడించింది. సుప్రీం ఆడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అంతర్జాతీయ సంఘం 1979లో ఏర్పాటయ్యింది. ప్రారంభంలో 11 సుప్రీం ఆడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఈ సంఘంలో సభ్యులుగా ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 47కు చేరింది. అసెంబ్లీ సమావేశాల్లో సుప్రీం ఆడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అంతర్జాతీయ సంఘం సభ్యులందరూ పాల్గొంటారు. మూడేళ్లకు ఒకసారి ఈ సమావేశం జరుగుతుంది.   

చదవండి: ఇండియా వర్సెస్‌ కెయిర్న్‌,.. కుదిరిన డీల్‌ ?

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు