నేడు 2020–21 జీడీపీ గణాంకాలు!

31 May, 2021 00:47 IST|Sakshi

8 శాతం వరకూ క్షీణ అంచనా..

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్‌–21మార్చి) గణాంకాలు సోమవారం వెలువడే అవకాశాలు ఉన్నాయి. కఠిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో 7.5% నుంచి 8% ఎకానమీ క్షీణత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చివరి త్రైమాసికంలో మాత్రం 2 శాతం వరకూ వృద్ధి అంచనాలు ఉన్నాయి.  కఠిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం మొదటి (–24.4 శాతం), రెండు (–7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలోనూ ఇదే సానుకూల ఒరవడి కొనసాగింది. 

2 నుంచి ఆర్‌బీఐ పరపతి సమీక్ష 
కాగా, ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష జూన్‌ 2 నుంచి 4వ తేదీ వరకూ జరగనుంది. 4న ప్రధాన నిర్ణయాలు వెలువడతాయి. బ్యాంకు లకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో వరుసగా ఆరవ త్రైమాసికంలో వృద్ధే లక్ష్యంగా 4 శాతంగా కొనసాగే వీలుంది. 
 

మరిన్ని వార్తలు