మూడో త్రైమాసికంలో భారత్‌ వృద్ధి 4.6 శాతం: ఎస్‌బీఐ అంచనా  

22 Feb, 2023 11:04 IST|Sakshi

ముంబై: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డిసెంబర్‌ త్రైమాసికంలో 4.6 శాతమన్న అంచనాలను బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గ్రూప్‌ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంత్‌ ఘోష్‌ వెలువరించారు. రెండవ త్రైమాసికంలో ఉన్న ఆశావహ పరిస్థితుల్లో తమ 30 హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు లేవని పేర్కొంది. మూడవ త్రైమాసికంలో వృద్ధి 4.4 శాతమన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా( ఆర్‌బీఐ) అంచనాలకన్నా ఎస్‌బీఐ గ్రూప్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ లెక్కలు అధికంగా ఉండడం గమనార్హం.

కాగా, ఆర్థిక సంవత్సరంలో (2022-23) 6.8 శాతం అంచనాలను 7 శాతానికి పెంచుతున్నట్లు ఘోష్‌ పేర్కొన్నా రు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌లో ఎకానమీ వృద్ధి రేటు 13.5 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికానికి ఇది 6.3 శాతానికి పడిపోయింది.   2023-24లో వృద్ధి 5.9శాతం : ఇండియా రేటింగ్స్‌   కాగా, 2023- 24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి 5.9 శాతమని ఇండియా రేటింగ్స్‌ ఒక నివేదికలో పేర్కొంది.  

మరిన్ని వార్తలు