కరోనా షాక్‌: తగ్గిన జువెల్లరీ ఎగుమతులు 

13 Apr, 2021 11:02 IST|Sakshi

25.71 శాతం క్షీణించిన  గోల్డ్‌ ఎగుమతులు

రూ.1,85,952 కోట్లకు చేరిన ఎక్స్‌పోర్ట్స్‌ 

నాల్గో త్రైమాసికంలో 12.73 శాతం వృద్ధి 

సాక్షి,ముంబై: 2020-21లో జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ పరిశ్రమ ఎగుమతులు 25.71శాతం తగ్గి రూ.1,85,952.34 కోట్లకు చేరాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్, ప్రయాణ ఆంక్షలే ఈ క్షీణతకు కారణమని జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) తెలిపింది. 2019–20లో ఈ పరిశ్రమ స్థూల ఎగుమతులు రూ.2,50,319.89 కోట్లుగా ఉన్నాయి. (మెరుపు తగ్గిన బంగారం..బ్యాంకింగ్‌కు ఇబ్బందే!)

జువెల్లరీ పరిశ్రమకు 2020-21అసాధారణ సంవత్సరమని..కొంతకాలంగా సాధారణ పరిస్థితులు నెలకోవటంతో రెండో అర్ధసంవత్సరంలో ఎగుమతుల్లో రికవరీ నమోదయిందని పేర్కొంది. తొలి మూడు త్రైమాసికాల్లో క్షీణత కనిపించగా.. నాల్గో త్రైమాసికంలో మాత్రం 12.73 శాతం వృద్ధి నమోదయిందని జీజేఈపీసీ చైర్మన్‌ కోలిన్‌ షా తెలిపారు. కట్‌ అండ్‌ పాలిష్‌ డైమండ్స్‌ (సీపీడీ) ఎగుమతులు గత ఆర్ధిక సంవత్సరంలో 8.87 శాతం తగ్గి రూ.1,32,015.25 కోట్ల నుంచి రూ.1,20,302.04 కోట్లకు చేరాయి. బంగారు ఆభరణాల ఎగుమతులు 57.89 శాతం క్షీణించి రూ.84,270.81 కోట్ల నుంచి రూ.35,483.17 కోట్లకు తగ్గాయి. వెండి ఆభరణాల ఎక్స్‌పోర్ట్స్‌ మాత్రం వృద్ధి చెందాయి. 43.55 శాతం పెరిగి రూ.11,955.75 కోట్ల నుంచి రూ.17,163.03 కోట్లకు వృద్ధి చెందాయి 

మరిన్ని వార్తలు