ఒక్కరాత్రిలో ట్రిలియనీర్‌ అయిన స్కూల్ విద్యార్థి?

21 Jun, 2021 15:19 IST|Sakshi

మనం కొన్ని సార్లు వార్తలలో ఒక్క రోజులో కోటీశ్వరడు అయినట్లు వచ్చిన వార్తలను ఇప్పటి వరకు చదివి ఉంటాం. కానీ, జార్జియా జరిగిన ఈ సంఘటన గురుంచి తెలిస్తే అందరూ ఆశ్చర్య పోతారు. సాదరణంగానే మన లాగే క్రిస్‌ విలియమ్స్‌ ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తాడు. అలా ఒక రోజు ఉదయం 9 గంటలకు లేవగానే విలియమ్స్‌ తన ఫోను చూసి షాక్‌కు గురయ్యాడు. నేనేమైనా కల కంటున్నానా అని తన కళ్లు నులిమి చూసుకున్నాడు. క్రిప్టోకరెన్సీ రాకెట్ బన్నీలో 20 డాలర్లు పెట్టుబడి పెట్టిన క్రిస్‌ రాత్రికి రాత్రే ట్రిలియనీర్‌ అయిపోయాడు. 

జార్జియాలోని మాంచెస్టర్‌లో చదువుకుంటున్న నర్సింగ్ పాఠశాల విద్యార్థి క్రిస్‌ విలియమ్స్‌ గత ఎనిమిది నెలల నుంచి క్రిప్టోకరెన్సీపై అధ్యయనం చేస్తున్నాడు. గత వారం రాకెట్‌ బన్నీ అనే క్రిప్టోకరెన్సీలో 20 డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. ఈ విలువ ఆ మరుసటిరోజుకు 1.4 ట్రిలియన్లకు పెరిగింది. మన కరెన్సీలోకి మార్చుకుంటే దీని విలువ సరిగ్గా రూ.10,37,49,10,00,00,000. అక్షరాల దీని విలువ రూ.కోటి కోట్లకు పైమాటే. కాసేపటికి తేరుకున్న విలియమ్స్‌ ఆ మొత్తాన్ని వేరే వాలెట్‌లోకి మార్చుకునేందుకు ప్రయత్నించాడు. అది అదే ధరను ఇతర వాలెట్‌లో చూపించడం లేదని తాను ఇన్వెస్ట్‌ చేసిన కాయిన్‌బేస్‌ వాలెట్‌ను సంప్రదించాడు. తాము ఈ సమస్య పరిష్కారానికి రాకెట్‌ బన్నీని సంప్రదిస్తున్నామని జవాబు వచ్చింది.

చాలా రోజులు గడిచిన ఎటువంటి సమాధానం రాకపోవడంతో సలహా కోసం ఈ విషయాన్ని విలియమ్స్‌ ట్విటర్‌లో నెటిజన్లతో షేర్‌ చేసుకున్నాడు. క్రిప్టోకరెన్సీలపై ఎప్పుడూ తనదైన శైలిలో ట్వీట్లు చేసే స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌నూ ట్యాగ్‌ చేసి, సలహా ఇవ్వాలని కోరాడు. తాను పెట్టుబడి పెట్టిన క్రిప్టోకరెన్సీ స్కామ్‌ కాకపోవచ్చని విలియమ్స్‌ భావిస్తున్నాడు. అతడు ఇంత మొత్తంలో వచ్చిన డబ్బును ఎన్నడూ ఖర్చు చేయలేనని కాబట్టి నేను దానిని  మంచి పనుల కోసం వినియోగిస్తాను అని విలియమ్సన్ చెప్పాడు. ఆ డబ్బుతో కుటు౦బాన్ని మంచిగా చూసుకోవడం, సహోదరీలకు ఇళ్లు కట్టించడం, ప్రజలకు ఉచిత వైద్య క్లినిక్లను ప్రారంభిస్తానని క్రిస్‌ చెప్పుకొచ్చాడు. తర్వాత కొద్ది రోజులకు కాయిన్ బేస్ యాప్ విలియమ్సన్ ఖాతాను స్తంభింపచేసింది.

దీంతో అంత మొత్తంలో వచ్చిన ఆ నగదును కాయిన్ బేస్ నుంచి ఉపసంహరించుకోలేడు, ఎటువంటి వర్తకం చేయలేడు. ఒక వార్త కథనం ప్రకారం కాయిన్ బేస్ ఈ సంఘటన గురుంచి వివరించింది. అదే రోజు జార్జియాలోని జాస్పర్ లో నివసిస్తున్న అతని స్నేహితుడు అదే నాణెం కొన్నాడు. కానీ అతడికి అంత మొత్తం నగదు జమ కాలేదు. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. సాంకేతిక లోపం వల్ల విలియమ్సన్ ఖాతాలో అంతా మొత్తం సంపద జమ అయినట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు