కేవలం 1 శాతం వడ్డీకే రుణం.. వారికి మాత్రమే

24 May, 2021 16:34 IST|Sakshi

దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మరి వల్ల ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే చాలా మంది ఆర్దికంగా పడుతున్న భాదల నుంచి బయటపడటానికి ఇతరులు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పథకంలో చేరిన వారికి కొంచెం ఊరట అని చెప్పుకోవాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో చేరిన వారికి అతి తక్కువ వడ్డీకే లోన్ పొందే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇది కేవలం పీపీఎఫ్ పథకంలో చేరిన వారికి మాత్రమే వర్తిస్తుంది. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో పీపీఎఫ్ ఒకటని చెప్పుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. 

ఈ పథకంలో చేరిన వారికి సులభంగానే లోన్ తీసుకునే సదుపాయం ఉంది. మీరు ఖాతా తెరిచిన తర్వాత 3వ ఏడాది నుంచి 6వ ఏడాది వరకు మధ్యలో ఎప్పుడైనా లోన్ తీసుకోవచ్చు. ఏడవ సంవత్సరం నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుల్లో గరిష్టంగా 50 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే మీరు లోన్ తీసుకోవాలని భావిస్తే.. పీపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసిన నగదులో 25 శాతం వరకు డబ్బులు పొందొచ్చు. ఇంతకు మించి తీసుకోవడానికి వీలు లేదు. అయితే ఈ రుణం మీద మీకు 1 శాతం వడ్డీకే లోన్ లభిస్తుంది. 

లోన్ తీసుకున్న తర్వాత నుంచి పూర్తిగా చెల్లించే వరకు మీరు జమ చేసిన నగదుపై ఎలాంటి వడ్డీ రాదు. అంటే మీకు లోన్‌పై వడ్డీ రేటు 8.1 శాతంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాంకులు అందించే వ్యక్తిగత రుణాలతో పోలిస్తే పీపీఎఫ్ ఖాతాపై రుణం తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే పీపీఎఫ్‌పై లోన్ తీసుకుంటే దీర్ఘకాలంలో కాంపౌండింగ్ బెనిఫిట్ పొందలేం. అందువల్ల మీరు పీపీఎఫ్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి.

చదవండి:

ప్రతి నెల ప‌ది వేల పెన్ష‌న్ పొందాలంటే..

మరిన్ని వార్తలు