క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాంకులు షాక్!

16 Mar, 2021 20:38 IST|Sakshi

కరోనా మహమ్మారి తర్వాత క్రెడిట్ కార్డు వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం నగదు లావాదేవీల కంటే ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దింతో వారి వ్యక్తిగత అవసరాల కోసం క్రెడిట్ కార్డును విపరీతంగా వాడుతున్నారు. దీనికి తగ్గట్లే షాపింగ్ మాల్స్, ఈ-కామర్స్, బ్యాంకులు క్రెడిట్ కార్డుల మీద వివిధ ఆఫర్లు అందిస్తున్నారు. దీనివల్ల అవసరం లేకున్నా కూడా వస్తువులు కొని తర్వాత లోన్ కట్టలేక  పోతున్నారు. దీని వల్ల అటు బ్యాంకులకు కూడా దీర్ఘకాలంలో నష్ట్టం వాటిల్లుతుంది. 

అయితే ఇటువంటి సమయంలో బ్యాంకులు క్రెడిట్ కార్డు విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక నుంచి వినియోగదారులు క్రెడిట్ కార్డులను పొందడం ఈజీ కాకపోవచ్చు. ప్రస్తుతం క్రెడిట్ కార్డు హోల్డర్లు ఉండటంతో క్రెడిట్ లావాదేవీలపై లిమిట్ తగ్గించడంతో పాటు కొత్త కార్డు తీసుకొనాలనుకునే వారి సిబిల్ స్కోర్ ను పక్కాగా చూడనున్నాయి. సిబిల్ స్కోర్ బాగున్నవారికి మాత్రమే ఇక నుంచి క్రెడిట్ కార్డులను ఇవ్వాలని తాజాగా బ్యాంక్ లు నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంక్ లో రుణాలు మంజూరు చేసే ముందు వినియోగదారుల క్రెడిట్ స్కోర్ ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోనున్నాయి. గత ఏడాది మొండిబాకీలు పెరగడంతో ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

చదవండి:

తిరుమల సందర్శకులకు తీపికబురు!

మరిన్ని వార్తలు