హ్యాపీ గృహాలు! ఎటుచూసినా హ్యాపీనెస్సే

13 Aug, 2022 12:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆఫీసులో పని ఒత్తిడి నుంచి బయటికి రాగానే ట్రాఫిక్‌ జాంలు, రణగొణధ్వనులు.. వీటన్నింటి నుంచి తప్పించుకొని కాసేపు సేదతీరాలంటే సొంతిల్లు ఆహ్లాదకరంగా ఉండాల్సిందే. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, నీటి పరవళ్ల సప్పుళ్లు, ఎటు చూసినా మెదడును ఉత్తేజ పరిచే చిహ్నాలు, బొమ్మలు, కొటేషన్స్, మధుర జ్ఞాపకాలను పదిల పరుచుకునే మెమొరీ బ్యాంక్‌.. ఆహా ఊహించుకుంటే ఎంతో బాగుంది కదూ! ఎస్‌.. అచ్చం ఇలాంటి  ప్రాజెక్ట్‌కే శ్రీకారం చుట్టింది గిరిధారి హోమ్స్‌. థీమ్‌ ప్రాజెక్ట్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన గిరిధారి మరో వినూత్న ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 

మనిషి ఆనందంగా ఉండాలంటే ఆదాయం, పెట్టుబడులు మాత్రమే రెట్టింపయితే చాలదు.. వారి సంతోషాలూ డబులవ్వాలి. అంటే ఉండే పరిసరాలు ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. ఇదే థీమ్‌గా హ్యాపీనెస్‌ హబ్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామని గిరిధారి హోమ్స్‌ ఎండీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన హ్యాపీనెస్‌ కాన్సెప్ట్‌తో కిస్మత్‌పూర్‌లో ఐదున్నర ఎకరాలలో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. జీ+5 అంతస్తులలో మొత్తం 567 ఫ్లాట్లుంటాయి. ప్రారంభ ధర రూ.60 లక్షలు. 1,033 చ.అ. నుంచి 1,601 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. 2025 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తవుతుంది.  

ఎటుచూసినా హ్యాపీనెస్సే: హ్యాపీనెస్‌ హబ్‌లో ఎటు చూసినా ఆనందాన్ని సూచించే సంకేతాలు, మనస్సును ఆహ్లాదపరిచే ప్రకృతి, పక్షుల కిలకిలారావాలు ప్రతిదీ సంతోషాన్ని రెట్టింపు చేసేలా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌కు 200 మీటర్ల దూరంలో ఈసా రివర్‌ ఉంటుంది. హ్యాపీ బాడీ, మైండ్, సోల్, హార్ట్‌ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో 20 వేల చ.అ.లలో క్లబ్‌హౌస్‌ ఉంటుంది. రెండు బ్యాడ్మింటన్‌ కోర్టులకు ఉత్సాహ, ఉల్లాస అని నామకరణం చేశారు. ఇలా నలభైకి పైగా పేర్లు, హ్యాపీనెస్‌ను ప్రేరేపించే చిహ్నా­లను ఎంచుకున్నారు. స్విమ్మింగ్‌ పూల్, జిమ్, ఇండోర్‌ గేమ్స్, 2 కి.మీ. జాగింగ్, వాకింగ్‌ ట్రాక్‌ వంటి అన్ని రకాల వసతులుంటాయి. ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం కూడా ఈ ప్రాజెక్ట్‌కు వర్తిస్తుంది. దీంతో రూ.2.5 లక్షల వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. లో రైజ్‌ అపార్ట్‌మెంట్‌ కారణంగా కొనుగోలుదారులకు అవిభాస్య స్థలం (యూడీఎస్‌) ఎక్కువ వస్తుంది. ప్రతి వెయ్యి చ.అ.కు 40 గజాల స్థలం వస్తుంది. 

మెమొరీ బ్యాంక్‌: ఈ ప్రాజెక్ట్‌లో నివాసితులకు వినూత్న అనుభూతిని కలిగించేందుకు తొలిసారిగా మెమొరీ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్క కొనుగోలుదారులకు ఒక లాకర్‌ను ఇస్తారు. ఇందులో వారి మధుర జ్ఞాపకాలను భద్రపరుచుకోవచ్చు. కొన్నేళ్ల తర్వాత వాటిని చూసుకుంటే అప్పటి మధుర క్షణాలు కళ్లముందు సాక్షాత్కారమవుతాయి. ఇప్పటివరకు గిరిధారి హోమ్స్‌ కిస్మత్‌పూర్‌లో 2 వేల గృహాలను పూర్తి చేసి, కొనుగోలుదారులకు అందించింది. వచ్చే 12 నెలల్లో మరో 30 లక్షల చ.అ.లలో ప్రాజెక్ట్‌లను ప్రారంభించనుంది.

మరిన్ని వార్తలు