‘ఉరితాడు దుస్తుల’తో ర్యాంప్‌ వాక్‌.. విమర్శలతో వెనక్కి!

5 Oct, 2021 12:15 IST|Sakshi
బర్‌బెర్రీ హూడీ(ఎడమ), గివెంచీ (కుడి వైపు)

Givenchy Suicide Hoodie Necklace Controversy: ఫ్యాషన్‌ ప్రపంచం ఓ పద్ధతి ప్రకారం నడవదు. ట్రెండ్‌ను ఒడిసిపట్టుకుని కొత్తగా, వింతగా అనిపించడమే కాదు.. ఒక్కోసారి  ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంటుంది. తాజాగా  ఓ ఫ్రాన్స్‌ దుస్తుల కంపెనీ రూపొందించిన దుస్తులపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.


‘బట్టలతో మనుషుల్ని చంపేయగలవ్‌ తెలుసా?’.. ఇది సినిమా డైలాగ్‌. కానీ, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ దుస్తుల కంపెనీ గివెంచీ అది నిజమని నిరూపిస్తోంది. Spring 2022-Ready to Wear collectionలో భాగంగా ఉరితాడును పోలి ఉన్న ఓ నెక్లెస్‌ను డ్రెస్‌కు అంటగట్టింది. ఆ దుస్తులతో మోడల్స్‌ ర్యాంప్‌ వాక్‌ చేయగా.. చూసినోళ్లంతా ‘చావమంటారా?’ అని తిట్టిపోస్తున్నారు. దీంతో గివెంచీ క్రియేటివ్‌ డైరెక్టర్‌ మాథ్యూ విలియమ్స్‌.. ఆ దుస్తుల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాణలు చెప్పారు.

   

ఇదిలా ఉంటే.. గతంలో బ్రిటిష్‌ దుస్తుల కంపెనీ బర్‌బెర్రీ 2019లో ఇదే తరహాలో ‘నూస్‌ హూడీ’(సూసైడ్‌ హూడీగా ట్రోల్‌ చేశారు)ని డిజైన్‌ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బర్‌బెర్రీ మోడల్‌ లిజ్‌ కెనెడీ ‘సూసైడ్‌ ఏం ఫ్యాషన్‌ కాదు’ అంటూ సెటైర్లు వేయడంతో కంపెనీ వెనక్కి తగ్గింది. అంతేకాదు ఆ టైంలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న మార్కో గోబెట్టి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

A post shared by Diet Prada ™ (@diet_prada)

ఇక గివెంచీ చర్యల నేపథ్యంలో ప్యాషన్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు  ‘డైట్‌ ప్రదా’ ఈ రెండు బ్రాండ్‌లకు సంబంధించిన దుస్తుల ఫొటోల్ని కంపేర్‌ చేస్తూ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్‌ చేయగా.. దుమారం మొదలైంది.

A post shared by @liz.kennedy_


చదవండి: నెట్‌ఫ్లిక్స్‌ను ఆకాశానికెత్తిన అమెజాన్‌ బాస్‌

మరిన్ని వార్తలు