Global Debt Jumps To A New High: ప్రపంచ దేశాల అప్పు ఎంతో తెలిస్తే షాకే...!

13 Oct, 2021 20:11 IST|Sakshi

Global Debt Jumps To A New High: మన దగ్గర సరిపడా డబ్బులు లేకపోతే ఏం చేస్తాం..! మనకు తెలిసిన స్నేహితుల నుంచో లేదా బంధువుల నుంచి అప్పుగా తీసుకుంటాం. వారి దగ్గర అప్పు ఎందుకులే అనుకునే వారు బ్యాంకులను ఆశ్రయిస్తారు. అలాగే మన దేశంతో సహా ఇతర దేశాలు పలు అంతర్జాతీయ బ్యాంకులను ఆశ్రయిస్తాయి. ఇతర దేశాల నుంచి కూడా పలు దేశాలు అప్పును తీసుకుంటాయి. ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు, వరల్డ్‌ బ్యాంకు వంటి నుంచి పలుదేశాలు అప్పులను పొందుతాయి.  

ప్రపంచదేశాల అప్పు తెలిస్తే షాకే...!
ఆయా దేశాల అభివృద్ధి కోసం వరల్డ్‌ బ్యాంకు, ఇతర సంస్థల నుంచి ప్రపంచదేశాలు అప్పులను పొందుతాయి. తాజాగా ప్రపంచదేశాల అప్పుపై ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌(ఐఎమ్‌ఎఫ్‌) కీలక వ్యాఖ్యలను చేసింది. ప్రపంచదేశాల అప్పు సుమారు 226 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు బుధవారం రోజున ఐఎమ్‌ఎఫ్‌ వెల్లడించింది. కోవిడ్‌-19 రాకతో పలు దేశాలు భారీగా అప్పులను తీసుకున్నట్లు పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే 2021గాను భారత అప్పులు సుమారు 90.6 శాతానికి పెరిగినట్లు ఐఎమ్‌ఎఫ్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్త రుణ సేకరణ విషయంలో అభివృద్ధి చెందిన  దేశాలు, చైనా 90 శాతం మేర నిధులను సమకూర్చాయి. మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలు కేవలం ఏడు శాతం మేర నిధులను మాత్రమే అందించాయి. 
చదవండి: భారత్‌ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..!

కోవిడ్‌-19రాకతో వేగంగా...!
కోవిడ్‌-19 రాకతో ప్రపంచదేశ ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పలు అభివృద్ధి చెందుతున్నదేశాలు, ఇతర చిన్నచిన్న దేశాలు అప్పుల కోసం ఎగబడ్డాయి. కోవిడ్‌-19 ఎదుర్కొనే సమయంలో ఆయా దేశాల రుణస్థాయిలు వేగంగా పెరిగి అధిక స్థాయికి చేరాయని ఐఎమ్‌ఎఫ్‌ 2021 ఆర్థిక మానిటర్‌ నివేదిక విడుదల సందర్భంగా  ఐఎమ్‌ఎఫ్‌ ఆర్థిక వ్యవహారాల శాఖ డైరెక్టర్‌ విటర్‌ గ్యాస్‌పర్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయా దేశాల పబ్లిక్‌, ప్రైవేటు రుణాల పెరుగుదల వాటి ఆర్థిక స్థిరత్వం, పబ్లిక్‌ ఫైనాన్‌స ప్రమాదాల్లో పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ రాకతో 2021లో సుమారు 65 నుంచి 75 మిలియన్ల వరకు దారిద్ర్యంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
చదవండి: ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్‌..! నీ రాక..వారికి శాపమే..!

మరిన్ని వార్తలు