పరిస్థితులు బాలేవు.. ఆర్థిక క్రమశిక్షణ అవసరం

17 Mar, 2023 00:28 IST|Sakshi

ప్రభుత్వాలు, కార్పొరేట్లు, వ్యక్తులకు సీఈఏ అనంత నాగేశ్వరన్‌ సూచన

క్రిసిల్‌ ఇండియా అవుట్‌లుక్‌ సెమినార్‌లో ప్రసంగం  

న్యూఢిల్లీ:  అమెరికాలో ఇటీవలి  పరిణామాల తర్వాత ప్రపంచ అనిశ్చితి పెరుగుతోందని చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌  పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కంపెనీలు, వ్యక్తులు తమతమ ఆర్థిక, కార్పొరేట్, పొదుపు ఖాతా ప్రణాళికలో ’భద్రత మార్జిన్‌లను’ జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన సూచించారు.

ప్రపంచ ఆర్థిక వృద్ధికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) జనవరిలో ఇచ్చిన అంచనాలు పాతవిగా కనిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన,  గత వారంలో అమెరికాలో జరిగిన పరిణామాలు ఆర్థిక విశ్వాసం, బ్యాంకింగ్‌ రుణాల వృద్ధి, సంబంధిత సరఫరాల వ్యవస్థలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయం తాజాగా తేలాల్సి ఉందని అన్నారు.

ప్రపంచ వృద్ధికి మరింత విఘాతంగా ఆయా పరిణామాలు కనిపిస్తున్నాయని అన్నారు. వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు (సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్‌ బ్యాంక్‌) మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్‌ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి.  ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్‌ రంగం పరిస్థితుల పై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన క్రిసిల్‌ ఇండియా అవుట్‌లుక్‌ సెమినార్‌ను ఉద్దేశించి అనంత నాగేశ్వరన్‌ ప్రసంగిస్తూ.. ప్రపంచ, భారత్‌ ఎకానమీ అంశాలను చర్చించారు. ఆయ న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

► అనిశ్చితి పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. గత వారంలో కొన్ని తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రతికూల వాతావారణం  ఈ ఏడాది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఆయా తీవ్ర పరిణామాలను దేశాలు ఎదుర్కొనాల్సి రావచ్చు.  
► గత వారంలో జరిగిన పరిణామాలు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపును ఆపాల్సిన పరిస్థితిని, అవసరాన్ని సృష్టించింది. ఈ పరిస్థితుల్లో అమెరికాలో  వడ్డీ రేట్ల పరిస్థితి ఏమిటి? డాలర్ల దారి ఎటు అన్న అంశంపై మీమాంస నెలకొంది.  
► తాజా పరిణామాలు  అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఎలాంటి చిక్కులను కలిగిస్తాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాలి.   ఒక కోణంలో ఆయా దేశాలకు సంబంధించి కరెన్సీలపై ఒత్తిడి తగ్గుతుందని, ఇది సానుకూల అంశమని నేను విశ్వసిస్తున్నాను. వడ్డీరేట్ల పెంపుకే అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడరల్‌ రిజర్వ్‌  కట్టుబడితే, ప్రపంచంలోని పలు దేశాలకు ఇది ఒక సవాలునే సృష్టిస్తుంది.  
► ఈ తరుణంలో భారతదేశం వంటి దేశాలపై ఈ పరిణామాల  ప్రభావాన్ని  లెక్కించడం ప్రస్తుతం కొంత క్లిష్టమైన అంశమే. ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులను భారత్‌ తట్టుకోగలదని విశ్వసిస్తున్నాను.  
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ 7 శాతం స్థూల దేశీయోత్పత్తిని సాధిస్తుందని విశ్వసిస్తున్నాం. ప్రస్తుత పరిధులలో ఉష్ణోగ్రతలు భారత్‌లో కొనసాగితే, (ముందుగా విత్తడం వల్ల) గోధుమ పంటకు సంబంధించి మనం సానుకూల ఫలితాన్ని పొందుతాయి.  ఈ అంశాలు చక్కటి పంట దిగుబడికి, ద్రవ్యోల్బణం కట్టడి కి, సరళతర ద్రవ్య పరపతి విధానాలకు తద్వా రా ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ఆయా అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్‌ కనీసం 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసం ఉంది.  
► ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, భారత్‌లో దాదా పు అన్ని రంగాలూ  కోవిడ్‌–19 ముందస్తు స్థితి కి చేరుకున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో వినియోగం వాటా కూడా పెరుగుతోంది.  
► ప్రస్తుత అనిశ్చితి వాతావరణంలో 8–9 శాతం జీడీపీ వృద్ధిరేటు గురించి ఎక్కువగా ఆశాజనకంగా ఉండకూడదు. వచ్చే 7–8 సంవత్సరాలలో 6.4 నుంచి 7 శాతం శ్రేణిలో వృద్ధి సాధించగలిగినా అది మనం మంచి ఫలితం సాధించినట్లే.  

2023–24లో 6 శాతం వృద్ధి: క్రిసిల్‌
భారత్‌ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) 6 శాతం వృద్ధిని సాధించవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనావేసింది. ప్రైవేట్‌ రంగంలో పెరుగుతున్న మూలధన పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. పలు సంస్థల 6.5%–7% అంచనాలకన్నా క్రిసిల్‌ లెక్క మరింత తక్కువగా ఉండ డం గమనార్హం. కాగా,  వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో భారత్‌ ఎకానమీ సగటున 6.8% వృద్ధిని నమోదుచేసుకుంటుందన్న అంచనాలను  క్రిసిల్‌ తన వార్షిక నివేదిక వెలువరించింది.

ఈ సందర్భంగా క్రిసిల్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ డీకే జోషి మాట్లాడుతూ, 2022–23లో ఆర్‌బీఐ రెపో రేటుకు ప్రాతిపదిక అయి న రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 6.8 శాతంగా నమోదవుతుందని అన్నా రు. అయితే ప్రధానంగా బేస్‌ ఎఫెక్ట్‌తోపాటు క్రూడ్, కమోడిటీ ధరల తగ్గుదల కారణంగా 2023– 24లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5%కి దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మంచి రబీ దిగుబడి కూడా ద్రవ్యోల్బణం కట్టడికి దోహ దపడుతుందని అంచనావేశారు. 2023–24లో కార్పొరేట్‌ రంగం రెవెన్యూ వసూళ్లు రెండంకెల్లో ఉంటాయని కూడా జోషి అభిప్రాయపడ్డారు.

మార్కెట్ల సంక్షోభాన్ని సులువుగా దాటేయగలం
► చౌక క్రూడాయిల్‌ దేశానికి సానుకూలం
► అంతర్జాతీయ అనిశ్చితిపై ఉదయ్‌ కొటక్‌ వ్యాఖ్యలు

స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల సంక్షోభాన్ని భారత్‌ సులువుగా దాటేయగలదని కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సీఈవో ఉదయ్‌ కొటక్‌ వ్యాఖ్యానించారు. ముడి చమురు రేట్లు తగ్గడం, కరెంటు అకౌంటు లోటు తగ్గుతుండటం మొదలైనవి దేశానికి సానుకూలాంశాలని గురువారం ఒక ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభం కొనసాగుతోంది. అదే సమయంలో, భారత్‌కు సంబంధించి స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్నాయి.

2023 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 2.5% లోపు ఉండవచ్చని అంచనాలు నెలకొన్నా యి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 2 శాతం దిగువకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, మనం చెప్పేది చేసి, జాగ్రత్తగా వ్యవç ßæరిస్తే ఈ సంక్షోభం నుంచి సులువుగానే బైటపడవచ్చు‘ అని కొటక్‌ పేర్కొన్నారు. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్‌వీబీ, సిగ్నేచర్‌) మూతబడటంతో మార్కె ట్లు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఆయ న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు