Gmail: జీమెయిల్‌ సరికొత్త రికార్డు..! ప్రపంచజనాభా కంటే ఎక్కువగా..!

11 Jan, 2022 17:14 IST|Sakshi

గూగుల్‌ రూపొందించిన ఈ-మెయిల్‌​ సర్వీస్‌ జీ మెయిల్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో అత్యధికంగా ఇన్‌స్టాల్‌ఐనా నాల్గవ యాప్‌గా జీ-మెయిల్‌ నిలిచింది. 

10 బిలియన్ల మైలు రాయి..!
ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలోజీమెయిల్‌ యాప్‌  10 బిలియన్(1000 కోట్ల) ఇన్‌స్టాల్‌లను సాధించింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 10 బిలియన్లకు పైగా ఇన్‌స్టాల్‌ఐనా  మైలురాయిని గూగుల్‌కు చెందిన మరో మూడు యాప్స్‌ గూగుల్‌ ప్లే సర్వీసెస్‌, యూట్యూబ్‌, గూగుల్‌ మ్యాప్స్‌ నిలిచాయి. ఇక్కడ విశేషమేమిటంటే ప్రపంచ జనాభా కంటే అధికంగా యాప్స్‌ డౌన్‌లోడ్స్‌ జరిగాయి. 

అద్భుతమైన ఫీచర్స్‌తో..!
జీమెయిల్‌ పేరుతో ఈమెయిల్ సేవలను గూగుల్‌ ఏప్రిల్ 2004 ప్రారంభించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్‌ భారీ ఆదరణను సాధించింది. కాలానుగుణంగా జీమెయిల్‌ అత్యధిక సంఖ్యలో అద్బుతమైన ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్‌ మీట్స్‌ను యాప్‌కు జోడించింది. అంతేకాకుండా యూజర్లు ఆడియో, వీడియో కాల్స్‌ను చేసుకునే ఫీచర్‌నుకు అందుబాటులోకి తెచ్చింది జీమెయిల్‌.

చదవండి: ఓలాపై ‘గుత్తాధిపత్య ధరల’ ఆరోపణలు కొట్టివేత

మరిన్ని వార్తలు