‘హైదరాబాద్‌లో మరింతగా విస్తరిస్తాం’

26 May, 2022 18:35 IST|Sakshi

గ్లాస్‌లైన్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ సెక్టార్‌లో తమ సేవలను మరింతగా విస్తరిస్తామని జీఎంఎం ఫాడ్‌లర్‌ ప్రకటించింది. ఈ సంస్థకు ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక ఫెసిలిటీ సెంటర్‌ ఉంది. దీని విస్తరణకు మరో 10 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు రెడీగా ఉన్నామని జీఎంఎం ఫాడ్‌లర్‌ ప్రతినిధులు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయిన తర్వాత ఫాడ్‌లర్‌ ఈ నిర్ణయం తెలిపింది. 

జీఎంఎం ఫాడ్‌లర్‌ సంస్థ గ్లాస్‌లైన్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌తో పాటు కరోషన్‌ రెసిస్టెంట్‌ టెక్నాలజీ, కెమికల్‌ సిస్టమ్స్‌ సర్వీసెస్‌, ఫార్మా, ఫుడ్‌ అండ్‌ ఎనర్జీ సెక్టార్లలో సేవలు అందిస్తోంది. ఆ సంస్థ సీఈవో థామస్‌ కేల్‌ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. 

చదవండి: తెలంగాణతో జట్టు కట్టిన మాస్టర్‌ కార్డ్స్‌

మరిన్ని వార్తలు