శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు.. మరో 30 ఏళ్లు జీఎంఆర్‌కే

4 May, 2022 21:28 IST|Sakshi

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాహాన బాధ్యతలు మరో ముప్పై పాటు జీఎంఆర్‌ సంస్థకు దక్కాయి. ఈ మేరకు సివిల్‌ ఏవియేష్‌ అథారిటీ ఇందుకు సంబంధించిన పత్రాలను జీఎంఆర్‌కు అందచేసింది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 21 మిలియన్‌ మంది ప్రయాణిస్తుండగా 1.50 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతోంది.

గతంలో బేగంపేటలో ఎయిర్‌పోర్టు ఉండగా శంషాబాద్‌ వద్ద పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ)లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పనులు 2004లో ప్రారంభించారు. 31 నెలల పాటు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2008లో ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చింది. పీపీపీ ఒప్పందంలో భాగంగా అప్పటి నుంచి  2038 వరకు ఎయిర్‌పోర్టు నిర్వాహాణ బాధ్యతలు జీఎంఆర్‌ సంస్థకు దక్కాయి.

తాజాగా మరో ముప్పై ఏళ్ల పాటు ఎయిర్‌పోర్టు నిర్వాహాణ బాధ్యతలు జీఎంఆర్‌కి కట్టబెడుతూ సివిల్‌ ఏవియేషన్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు 2068 మార్చి 23 వరకు జీఎంఆర్‌ ఆధీనంలో ఉండనుంది. ఇటీవల ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు భారీ ఎత్తున  జీఎంఆర్‌ సంస్థ చేపట్టింది. ఏడాదికి 35 మిలియన్‌ మంది ప్రయాణించేలా ఇక్కడ సౌకర్యాలను మెరుగు పరుస్తోంది. 
 

చదవండి: విస్తరణ బాటలో ఫనాటిక్స్‌

మరిన్ని వార్తలు