GMR Group: బ్లాక్‌చెయిన్‌ స్టార్టప్‌లకు అండగా జీఎంఆర్‌ ఇన్నోవెక్స్‌!

23 Aug, 2022 17:22 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్లాక్‌చెయిన్‌ విభాగంలో స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు ఇన్‌ఫ్రా దిగ్గజం జీఎంఆర్‌ గ్రూప్‌లో భాగమైన  జీఎంఆర్‌ ఇన్నోవెక్స్‌ తాజాగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ)ను ఏర్పాటు చేసింది.

విమానాశ్రయాలు, అనుబంధ వ్యాపారాల్లో బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత వినియోగానికి అవకాశాలను అధ్యయనం చేసేందుకు ఐడియాల్యాబ్స్, పాలిగాన్, కాయిన్‌ఎర్త్, ఇండియా బ్లాక్‌చెయిన్‌ ఫోరం, వెరోయిన్స్‌ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

వ్యాపార దిగ్గజాలు, పరిశ్రమ నిపుణులు, టెక్నాలజీ భాగస్వాముల సహాయంతో జీఎంఆర్‌ ఇన్నోవెక్స్‌–బ్లాక్‌చెయిన్‌ సీవోఈ .. అంకుర సంస్థలను గుర్తించి, అవి వృద్ధి చెందేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తుందని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఈడీ (సౌత్‌) ఎస్‌జీకే కిషోర్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు