హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి అరుదైన గౌరవం

20 Jun, 2022 11:36 IST|Sakshi

జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కి అరుదైన గౌరవం లభించింది. స్కైట్రాక్స్‌ వరల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ అవార్డ్స్‌ 2022లో బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌ ఇన్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఏషియా అవార్డును దక్కించుకుంది. అంతేకాదు ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో కూడా హైదరాబాద్‌ స్థానం మెరుగైంది. టాప్‌ 100 ఎయిర్‌పోర్ట్‌ లీగ్‌ జాబితాలో  2021లో 64వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానంపైకి ఎగబాకి 63వ ప్లేస్‌లో నిల్చుంది. 

బెస్ట్‌ స్టాఫ్‌ విభాగంతో పాటు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మరికొన్ని విభాగాల్లోనూ ప్రశంసలు దక్కాయి. బెస్ట్‌ రీజనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇన్‌ ఇండియా (ద్వితీయ), క్లీనెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇన్‌ ఇండియా (మూడవ), బెస్ట్‌ రీజనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇన్‌ ఏషియా (నాలుగవ) విభాగాల్లోనూ హైదరాబాద్‌కు టాప్‌లో నిలిచేందుకు ప్రయత్నించింది. 

చదవండి: హైదరాబాద్‌లో తొలిసారిగా మహిళల కోసం

మరిన్ని వార్తలు