విమాన టికెట్లపై గో ఫస్ట్‌ అదిరిపోయే ఆఫర్‌: రేపటి వరకే ఛాన్స్‌

23 Feb, 2023 19:37 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్‌ తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది. దేశీయ,అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలపై ఆఫర్‌ను అందిస్తోంది. నేటి నుంచి రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 23-24) విక్రయిస్తున్న ఈ స్పెషల్‌ సేల్‌లో దేశీయ విమాన టికెట్ల ధరలు  రూ. 1,199 వద్ద, అంతర్జాతీయ విమానాల ఛార్జీలు రూ. 6,139 నుంచి ప్రారంభమవుతాయని గో ఫస్ట్ తెలిపింది. 

(ఇదీ చదవండి: సీఐసీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్)

సమ్మర్ ట్రావెల్ సీజన్‌కు ముందు బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ గో ఫస్ట్ ఫిబ్రవరి 23న రెండు రోజుల ధరల విక్రయాన్ని ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతుందని, ప్రయాణ కాలం మార్చి 12 నుంచి సెప్టెంబర్ 30, 2023 వరకు ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కూడా ఇదే విధమైన ఆఫర్‌ ప్రకటించింది.ఇండిగో దేశీయ విమాన టిక్కెట్లను రూ. 2,093 (ప్రారంభ ధర) ఆఫర్‌ ప్రకటించిన రోజు తర్వాత గో ఫస్ట్ ప్రకటన వచ్చింది. ఇండిగో సేల్‌ ఫిబ్రవరి 25 వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్‌లో బుక్‌ చేసుకున్న టికెట్లపై  మార్చి 13 నుండి అక్టోబర్ 13, 2023 వరకు  ప్రయాణించవచ్చు.

(సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్‌ దిగ్గజం)

కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఫిబ్రవరి 20న విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి 2023లో 125.42 లక్షల మంది ప్రయాణీకులతో దేశీయ విమానాల రాకపోకలు గత ఏడాది కాలంతో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయి. డిసెంబరు 2022 నుండి 127.35 లక్షలతో పోలిస్తే 1.5 శాతం తక్కువగా ఉంది. అయితే విమాన ట్రాఫిక్ ఇప్పటికీ ప్రీ-కోవిడ్‌ స్థాయిల కంటే తక్కువగా ఉంది. జనవరి 2020లో దేశీయ విమానయాన సంస్థలు 127.83 లక్షల మంది ప్రయాణికులతో ప్రయాణించారు. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!)

మరిన్ని వార్తలు