మోల్బియోలో టెమసెక్‌ పెట్టుబడి

29 Sep, 2022 08:38 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వైద్య పరికరాల తయారీలో ఉన్న మోల్బియో డయాగ్నోస్టిక్స్‌ తాజాగా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ టెమసెక్‌ నుంచి రూ.695 కోట్ల నిధులను అందుకుంది. ఆధునిక సాంకేతిక ఉత్పత్తుల అభివృద్ధికి ఈ నిధులను వెచ్చిస్తామని కంపెనీ ప్రకటించింది. క్షయ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే ట్రూనాట్‌ పరికరాన్ని మోల్బియో డయాగ్నోస్టిక్స్‌ రూపొందించింది. 40కిపైగా దేశాల్లో ఈ పరికరాన్ని వినియోగిస్తున్నారు. 

చదవండి: స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో కొత్త రూల్స్‌ వచ్చాయ్‌.. ఇది తప్పనిసరి!

మరిన్ని వార్తలు