ఆ మూడు రోజులు మద్యం బంద్‌: ఎందుకు? ఎక్కడ?

30 Jul, 2022 11:56 IST|Sakshi

పనాజీ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. ఆగస్టులో గోవా పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9, 10, 12 తేదీలను డ్రై డేలుగా పాటిస్తామని  ఆర్థిక కార్యదర్శి ప్రణబ్ భట్ శుక్రవారం ఒక  నోటిఫికేషన్ జారీ చేశారు.

గోవాలోని 186 పంచాయతీ సంస్థలకు ఆగస్టు 10న ఎన్నికలు జరగనున్నాయి. 12వ తేదీన లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 9,10,12 తేదీల్లో 'డ్రై డే' అమల్లోకి వస్తుందని సర్కార్‌ ప్రకటించింది. ఆగస్టు 9,10, 12 తేదీల్లో మద్యం అమ్మకాలను నిలిపి వేయాలని మద్యం దుకాణదారులకు ఆదేశించారు. లైసెన్సు పొందిన బార్​ అండ్​ రెస్టారెంట్లలో కూడా మద్యం  అమ‍్మకాలు నిషేధమని ప్రభుత్వం  స్పష్టం చేసింది. కేవలం ఆహారాన్ని అందించడానికి మాత్రమే  ఆయా దుకాణాలను తెరవాలని చెప్పింది. ఈ విషయాన్ని తెలిపేలా ఒక బోర్డును కూడా ప్రదర్శించాలని నోటిఫికేషన్ పేర్కొంది.

చదవండి : ట్విటర్‌ డీల్‌ వివాదం: మస్క్‌ మరో కీలక నిర్ణయం
విలీనమా.. నో వే! కావాలంటే వారు వెళ్లిపోవచ్చు! 

మరిన్ని వార్తలు