రూ . 60 వేల దిగువకు వెండి

28 Sep, 2020 18:03 IST|Sakshi

నేలచూపులు

ముంబై : బంగారం ధరల వరుస పతనాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఒడిదుడుకులకు లోనవుతుండటంతో దేశీ మార్కెట్‌లోనూ యల్లోమెటల్‌ ధరలు దిగివచ్చాయి. సోమవారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 100 రూపాయలు తగ్గి 49,561 రూపాయలు పలికాయి. ఇక కిలో వెండి 181 రూపాయలు భారమై 59,208 రూపాయలు పలికింది. బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖ పట్టడంతో గత నెల రికార్డు ధరల నుంచి పసిడి రూ 7,000 వరకూ దిగివచ్చింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డెమొక్రాటిక్‌ ప్రత్యర్థి జో బిడెన్‌ల మధ్య మంగళవారం అధ్యక్ష ఎన్నికల తొలి డిబేట్‌ జరగడంపై మదుపుదారులు ఆసక్తి చూపుతున్నారు. అమెరికాలో మరో ఉద్దీపన ప్యాకేజ్‌ ప్రకటిస్తారనే సంకేతాల కోసం కూడా ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు.

చదవండి : గుడ్‌న్యూస్‌ : భారీగా దిగివచ్చిన బంగారం

మరిన్ని వార్తలు