దిగివచ్చిన పసిడి ధరలు

22 Oct, 2020 20:26 IST|Sakshi

ముంబై : మూడు రోజల పాటు వరుసగా పెరిగిన బంగారం ధరలు గురువారం స్వల్పంగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో  బంగారం ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో పదిగామ్రుల బంగారం 523 రూపాయలు తగ్గి 50,810 రూపాయలకు పడిపోయింది.

ఇక వెండి ధర కిలోకు 987 రూపాయలు తగ్గి 62,642 రూపాయలకు దిగివచ్చింది. అమెరికాలో మరో విడత ఉద్దీపన ప్యాకేజ్‌పై మళ్లీ అస్పష్టత నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి.మరోవైపు పసిడి ధరలు మరికొద్ది రోజులు ఒడిదుడుకులతో సాగుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు