ఆల్‌టైం హై నుంచి భారీ పతనం

11 Aug, 2020 19:45 IST|Sakshi

ఒక్కరోజే రూ 2392 తగ్గిన బంగారం

ముంబై : బంగారం ధరలు గత మూడురోజుల్లో మంగళవారం రెండోసారి భారీగా దిగివచ్చాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 2392 రూపాయలు తగ్గి 52,554 రూపాయలకు పతనమైంది. ఇక కిలో వెండి ఏకంగా 5080 రూపాయలు తగ్గుముఖం పట్టి 70,314 రూపాయలకు దిగివచ్చింది. డాలర్‌ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒత్తిడికి లోనయ్యాయి.

ఇక అమెరికాలో ఆర్థిక ఉద్దీపన ప్రణాళిక పురోగతిపై ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతోనూ పసిడి కొనుగోళ్లను ప్రభావితం చేసింది. దీంతో స్పాట్‌గోల్డ్‌ ఔన్స్‌ ధర 2021 డాలర్లకు పడిపోయింది. అమెరికన్‌ డాలర్‌ కోలుకుంటే బంగారం ధరలు మరింత తగ్గుముఖం పడతాయని, బంగారంలో తాజా పెట్టుబడులపై వేచిచూసే ధోరణి అవలంభించాలని కోటక్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇక కోవిడ్‌-19 కేసుల పెరుగుదలతో ఈ ఏడాది బంగారం ధరలు 35 శాతం పెరిగాయి. చదవండి : పసిడి ఎఫెక్ట్ : రూ . 1500 కోట్ల ఆదాయం

మరిన్ని వార్తలు