దిగివచ్చిన పసిడి, వెండి ధరలు

24 Sep, 2020 19:51 IST|Sakshi

వరుసగా నాలుగో రోజు ధరల పతనం

ముంబై : బంగారం ధరలు వరుసగా గురువారం నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పతనంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరలు దిగివచ్చాయి. అమెరికన్‌ డాలర్‌ పటిష్టమవడంతో బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది. ఈ వారం పదిగ్రాముల బంగారం 2,500 రూపాయలు దిగిరాగా, కిలో వెండి 10,000 రూపాయలకు పైగా పడిపోయింది.

ఇక ఎంసీఎక్స్‌లో గురువారం పదిగ్రాముల బంగారం 68 రూపాయలు తగ్గి 49,440 రూపాయలకు పడిపోగా, కిలో వెండి ఏకంగా 1502 రూపాయలు పతనమై 56,986 రూపాయలకు దిగివచ్చింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో రెండు నెలల కనిష్టస్ధాయికి పసిడి ధరలు పతనమయ్యాయి. స్పాట్‌గోల్డ్‌ ఔన్స్‌ 1858 డాలర్లకు దిగివచ్చింది. మరోవైపు కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : ఒడిదుడుకుల్లో పసిడి ధరలు

మరిన్ని వార్తలు