రెండ్రోజుల్లో రూ .1500 భారం

18 Aug, 2020 18:37 IST|Sakshi

మళ్లీ 70వేల మార్క్‌ దాటిన వెండి

ముంబై : గత వారం దిగివచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. గత రెండు రోజుల్లో పదిగ్రాముల బంగారం 1500 రూపాయలు భారం కాగా, కిలో వెండి ఏకంగా 3000 రూపాయలు పెరిగింది. డాలర్‌ బలహీనపడటంతో పాటు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు పసిడికి డిమాండ్‌ పెంచాయని, కోవిడ్‌-19 కేసుల పెరుగుదలతో కూడా ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారని బులియన్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇక ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 645 రూపాయలు పెరిగి 53,920 రూపాయలకు చేరింది. కిలో వెండి 1978 రూపాయలు భారమై మళ్లీ 70 వేల మార్క్‌ దాటి 71,133 రూపాయలు పలికింది. అమెరికన్‌ డాలర్‌ ఈ వారం కనిష్టస్ధాయిలో పతనమవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు 2000 డాలర్ల మార్క్‌ను తిరిగి చేరాయి. హువాయి టెక్నాలజీస్‌పై అగ్రరాజ్యం తాజా ఆంక్షలతో అమెరికా-చైనా ఉద్రిక్తతలు పెరగడం పసిడి డిమాండ్‌ను పెంచింది.

చదవండి : వచ్చే ఏడాదిలోగా 2300డాలర్లకు బంగారం: గోల్డ్‌మెన్‌ శాక్స్‌

మరిన్ని వార్తలు