మళ్లీ భారమైన బంగారం

9 Oct, 2020 18:39 IST|Sakshi

ముంబై : బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ కొండెక్కుతున్నాయి. రోజుకో తీరుగా సాగుతున్న పసిడి పయనంతో స్వర్ణం సామాన్యుడికి దూరమవుతోంది. ఇక డాలర్‌ క్షీణించడం, ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌పై అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో పసిడి భారమవడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. ఎంసీఎక్స్‌లో శుక్రవారం పదిగ్రాముల బంగారం 515 రూపాయలు పెరిగి 50,690 రూపాయలు పలికింది. కిలో వెండి ఏకంగా 1229 రూపాయలు పెరిగి 61,748 రూపాయలకు ఎగబాకింది.

ఎంసీఎక్స్‌లో బంగారానికి 49,920 రూపాయల వద్ద కీలక మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నామని, ఆ ధరపై నిలబడితే బంగారం మరోసారి రూ . 50,500 స్ధాయి వద్ద నిరోధకాలు ఎదురవుతాయని పృధ్వి ఫిన్‌మార్ట్‌ డైరెక్టర్‌(కమాడిటీ హెడ్‌) మనోజ్‌ జైన్‌ అంచనా వేశారు. ఇక కోవిడ్‌-19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై వెల్లడైన సంకేతాలతో బంగారం ధరలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1895 డాలర్లకు పెరగ్గా, వెండి ఔన్స్‌కు 23.88 డాలర్లకు ఎగిసింది.

చదవండి : అప్పటి వరకూ.. పసిడి పరుగే!

మరిన్ని వార్తలు