తగ్గిన బంగారం ధరలు

27 Oct, 2020 20:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం, డిమాండ్‌ తగ్గుదలతో దేశీ మార్కెట్‌లో మంగళవారం పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో పదిగ్రాముల బంగారం 137 రూపాయలు తగ్గి 51,108 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి 475 రూపాయలు పెరిగి 62,648 రూపాయలకు ఎగబాకిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది.

మరోవైపు ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 43 రూపాయలు తగ్గి 50,887 రూపాయలకు దిగిరాగా, కిలో వెండి 46 రూపాయలు పతనమై 61,860 రూపాయలు పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగి ఔన్స్‌కు 1903 డాలర్లకు చేరాయి. చదవండి : ట్రంప్‌ ఎఫెక్ట్‌- పసిడి, వెండి.. మెరుపులు

మరిన్ని వార్తలు