51,648 రూపాయలు పలికిన బంగారం

31 Aug, 2020 18:01 IST|Sakshi

ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయంతో ఎగిసిన పసిడి

ముంబై : గత కొద్దిరోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మళ్లీ పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో సోమవారం పదిగ్రాముల బంగారం 200 రూపాయలు భారమై 51,648 రూపాయలు పలికింది. కిలో వెండి ఏకంగా 930 రూపాయలు పెరిగి 66,906 రూపాయలకు చేరింది. ఆగస్ట్‌ 7న బంగారం ధరలు రికార్డుస్ధాయిలో 56,200 రూపాయలకు చేరిన తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇక వడ్డీరేట్లను మరికొంత కాలం దిగువ స్ధాయిలోనే ఉంచాలని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలు పంపడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎగిశాయి.

డాలర్‌ బలహీనపడటం కూడా పసిడి ధరలకు డిమాండ్‌ పెంచింది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను నామమాత్ర స్ధాయిలో కొనసాగించేందుకు ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయించడంతో బంగారం, వెండి ధరలు లాభపడ్డాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విశ్లేషించింది. ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో స్పాట్‌ గోల్డ్‌ రెండు వారాల గరిష్టస్ధాయిలో ఔన్స్‌కు 1971.68 డాలర్లకు చేరింది. చదవండి : పసిడి ధరల పతనానికి బ్రేక్‌

మరిన్ని వార్తలు