గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్!

21 Jun, 2021 18:26 IST|Sakshi

ఎమ్ఎస్ఎమ్ఈలకు రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్

7.35 శాతం వడ్డీరేటు

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. కుటుంబాల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా వ్యాపారాల పరిస్థితి మరి దారుణంగా ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా అనేక చిన్న, చిన్న వ్యాపారాల మీద పడింది. అయితే, ఈ ఎమ్ఎస్ఎమ్ఈలకు తాము అండగా ఉంటామని కెనరా బ్యాంక్ భరోసా ఇచ్చింది. మన దేశంలో గోల్డ్ లోన్ అత్యవసర ఆర్థిక సాయంగా పరిగణిస్తారు. కెనరా బ్యాంక్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎమ్ఎస్ఎమ్ఈల) కోసం గోల్డ్ లోన్ లను అందిస్తోంది. "కెనరా బ్యాంక్ మా ఖాతాదారులకు ఆకర్షణీయమైన గోల్డ్ లోన్స్ తక్కువ వడ్డీరేట్లతో అత్యవసర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మీకు ఎల్లప్పుడూ మాతో భద్రతా ఉంటుంది" అని కెనరా బ్యాంక్ ట్వీట్ చేసింది.

కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు 7.35 శాతం వడ్డీరేటుకే "గోల్డ్ లోన్"ను అందిస్తోంది. ఈ గోల్డ్ లోన్ అత్యవసర ఆర్థిక అవసరాలకు అనువైనదని పేర్కొంది. తక్కువ వడ్డీ రేటుకు గోల్డ్ లోన్ ను వేగంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఏవైనా ఎంక్వైరీల కోసం 1800 425 0018 /1800 103 0018కు కాల్ చేయవచ్చు అని తెలిపింది. మీ లాకర్ లోని బంగారం మీ వ్యాపారానికి గోల్డ్ మైన్ కావచ్చు అని కెనరా బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఎమ్ఎస్ఎమ్ఈల కొరకు ఓవర్ డ్రాఫ్ట్ లేదా డిమాండ్ లోన్ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ లోన్ కింద రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణ మొత్తాన్ని అప్పుగా తీసుకోవచ్చని బ్యాంకు తెలిపింది. రేపో రేటుతో ముడిపడి ఉన్న 7.35 శాతం పోటీ వడ్డీ రేటును అందిస్తున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకుకి దేశ వ్యాప్తంగా 10,495 శాఖలు, 13,023 ఎటిఎంలు ఉన్నాయి.

చదవండి: పాన్ కార్డులో ఉన్న ఈ సీక్రెట్ కోడ్స్ తెలుసా?

మరిన్ని వార్తలు