భారీగా పెరిగిన బంగారం ధరలు!

6 Dec, 2021 18:19 IST|Sakshi

మీరు బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక చెదువార్త. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పెరిగాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి అని నిపుణులు సూచిస్తున్నారు. నేడు ఇండియన్ జువెలరీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.47,877గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధర సుమారు రూ.350 పెరిగింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.43,855గా ఉంది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹48,830గా ఉంటే.. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర ₹44,760కు చేరుకుంది. విజయవాడ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.200కి పైగా పెరిగి రూ.6,1233కు చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.

(చదవండి: జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగించిన సీఈఓ.. ఎందుకో తెలుసా?)

మరిన్ని వార్తలు