బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధర..!

15 Feb, 2022 18:52 IST|Sakshi

మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక షాకింగ్ న్యూస్. బంగారం ధరలు బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్నాయి. కేవలం ఒక్కరోజులో బంగారం ధర సుమారు రూ.600కి పైగా పెరగడం విశేషం. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం, అంతర్జాతీయంగా బంగారనికి డిమాండ్ పెరగడంతో దేశంలో ధరలు భారీగా పెరిగాయి. బంగారం భారీ వేగంతో పెరగడంతో సామాన్యుడు బంగారం కొనాలంటేనే బయపడే పరిస్థితి ఏర్పడింది. కేవలం 4 రోజుల్లోనే పసిడి ధర సుమారు రూ.1400 పెరగడం విశేషం. కేవలం ఈ ఫిబ్రవరి నెలలోనే బంగారం ధర రూ.2 వేలకు పైగా పెరిగింది. 

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్‌ గోల్డ్‌ 999) బంగారం ధర సుమారు రూ.600కి పైగా పెరిగి రూ.50,356 వద్దకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.45,561 నుంచి  రూ.46,126కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46,300 నుంచి రూ.46,400 పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.100 పెరిగింది. ఇక బిస్కెట్‌ గోల్డ్‌ బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,620కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.600కి పెరిగి రూ.64,440కి చేరుకుంది.

బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.
#Gold and #Silver Opening #Rates for 15/02/2022#IBJA pic.twitter.com/7W8pRrFfyr

(చదవండి: ప్రముఖ ఐపీఎల్ జట్టుతో అథర్ ఎనర్జీ ఈవీ కంపెనీ కీలక ఒప్పందం..!)

మరిన్ని వార్తలు