రెండో రోజు భారీగా పడిపోయిన బంగారం ధరలు

18 Jun, 2021 16:53 IST|Sakshi

బంగారం ధరలపై అమెరికా వడ్డీరేట్ల ప్రభావం

మీరు బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. కేవలం రెండు రోజుల్లోనే రూ.1300 పైగా పడిపోయింది. గతంలో ఇంత మొత్తంలో తగ్గిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. అమెరికాలో వడ్డీరేట్లు పెరగవచ్చన్న అంచనాలు అంతర్జాతీయంగా పసిడి పతనానికి దారితీశాయి. అలాగే, దేశీయంగా కూడా పుత్తడి ధరలు తగ్గాయి. మరోవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్(ఐబీజెఎ) ప్రకారం.. 10 గ్రాముల 24 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.410లు తగ్గడంతో రూ.47,201కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.47,611గా ఉంది. ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.376 తగ్గడంతో రూ.43,236కి చేరుకుంది. 

అటు హైదరాబాద్‌ మార్కెట్లో కూడా పసిడి ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.44,250కి చేరుకుంది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.44,850గా ఉంది. బంగారు ఆభరణ తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.660 తగ్గి రూ. 48,270కు పడిపోయింది. బంగారం దారిలోనే వెండి కూడా పయనించింది. నేడు ఒక కేజీ వెండి ధర రూ.1700 పడిపోయి రూ.68379 వద్ద ట్రేడింగ్ అవుతుంది. అంతర్జాతీయం ఫ్యూచర్స్‌ మార్కెట్‌ న్యూయార్క్‌ కమోడిటీ ఎక్సేంజ్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోల్చితే దాదాపు 100 డాలర్లు పతనమై, 1770 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

చదవండి: ఆఫ్రికాలో దొరికిన అరుదైన మూడో అతిపెద్ద వజ్రం

>
మరిన్ని వార్తలు