Gold Price: పసిడి పరుగో పరుగు.. తులం ఎంతంటే?

9 Feb, 2022 18:57 IST|Sakshi

గత కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నా బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఈ నెల మొదటి నుంచి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడం, పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం ధరలకు డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు. బంగారం భారీగా దూసుకెళ్తుండటంతో సామాన్యుడు బంగారం కొనాలంటేనే బయపడే పరిస్థితి ఏర్పడింది. కేవలం ఈ నెల ప్రారంభ 9 రోజుల్లోనే సుమారు రూ.1000 పెరిగింది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్‌ గోల్డ్‌ 999) బంగారం ధర రూ.48,691 వద్దకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర ఒక్క రోజులో రూ.260కి పైగా పెరిగి రూ.44,601కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.45,400 నుంచి రూ.45,550 పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.150 పెరిగింది. ఇక బిస్కెట్‌ గోల్డ్‌ బంగారం ధర రూ.160 పెరిగి రూ.49,690కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.900కి పెరిగి రూ.62,463కి చేరుకుంది.

బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.

(చదవండి: ట్వీట్ రగడ.. క్షమాపణలు చెప్పిన హోండా, డొమినోస్)

మరిన్ని వార్తలు