బంగారం కొనేవారికి శుభవార్త!

1 Sep, 2021 16:46 IST|Sakshi

మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. బంగారం ధర నేడు భారీగా తగ్గింది. దేశీయ మార్కెట్లో రూపాయి బలం పుంజుకోవడంతో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఎంసీఎక్స్ లో గోల్డ్ ధర వరుసగా మూడవ రోజు పడిపోయింది. డాలర్ తో పోలిస్తే దాదాపు మూడు నెలల గరిష్ట స్థాయిలో 73 రూపాయల వద్ద ముగిసింది. దీంతో దిగుమతులపై ఆ ప్రభావం పడింది. ఢిల్లీ మార్కెట్లో అత్యధిక స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,424 నుంచి రూ.47,287కు పడిపోయినట్లు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది.(చదవండి: మీ ఆధార్‌ కార్డు ఒరిజినలేనా? ఇలా చెక్‌ చేస్కోండి)

ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగార ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు అత్యధిక స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,330గా ఉంటే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,300గా ఉంది. వెండి ధర కూడా భారీగానే తగ్గింది. నేడు కిలో వెండి ధర రూ.62,957గా ఉంది. బంగారం ధరపై చాలా అంశాలు ప్రభావితం చూపుతాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి అంశాలు పుత్తడి ధరలపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

మరిన్ని వార్తలు