బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్!

15 Jul, 2021 15:19 IST|Sakshi

బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్ తగిలింది. భారతదేశంలో బంగారం ధరలు దాదాపు నాలుగు వారాల గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. రాయిటర్స్ ప్రకారం.. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ కు 0.1% పెరిగి 1,826.40 డాలర్లకు చేరుకుంది. జూన్ 16 తర్వాత ఇదే అత్యధికం. న్యూఢిల్లీ బులియన్ జువెలరీ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.48,108 నుంచి రూ.48,474 పైకి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ.335 పెరిగి రూ.44,402 వద్ద నిలిచింది.

హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 నుంచి రూ.45,150కి చేరుకుంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 నుంచి రూ.49,260కు పెరగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కేజీ వెండి ధర రూ.581 పెరిగి కిలో రూ.69,516కు చేరింది. అంతకుముందు రోజు కిలో రూ.68,935గా ఉన్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు