మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే?

24 Mar, 2022 18:23 IST|Sakshi

గత కొద్ది రోజులుగా బంగారం ధరల విషయంలో ఊగిసలాట దొరణి కనిపిస్తుంది. నిన్న తగ్గిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల యుఎస్ డాలర్ క్షీణించడం, అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల భారతదేశంలో బంగారం ధరలు గురువారం ఫ్లాట్'గా ట్రేడవుతున్నాయి అని నిపుణులు తెలుపుతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్‌)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.15 పెరిగి 10 గ్రాములకు రూ.51,782 వద్ద ట్రేడవుతుండగా, వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.135 తగ్గుదలతో రూ.68,129 వద్ద కొనసాగుతోంది. 

స్పాట్ గోల్డ్ ధర ఔన్స్'కు 1,943.75 డాలర్ల వద్ద ఉంటే, యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి 1,944.40 డాలర్లకు చేరుకుంది. ఇక దేశంలో ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.400కి పైగా పెరిగి ₹51,777కి చేరుకుంది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,005 నుంచి రూ.47,428కి పెరిగింది. అలాగే, మన హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 

ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.47,950కి చేరుకుంది. అలాగే, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 నుంచి రూ.52,310కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నేడు 1 కేజీ వెండి ధర రూ.67,004 నుంచి రూ.67,770కి పెరిగింది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. 

(చదవండి: డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియాకు సునీల్ రాయన్ రాజీనామా!)

మరిన్ని వార్తలు