Gold Price 31 March 2021: దిగి వస్తున్న బంగారం ధరలు 

31 Mar, 2021 12:15 IST|Sakshi

తగ్గుతున్న వెండి,బంగారం ధర

బలహీనంగా  రూపాయి

నాలుగున్నర నెలల గరిష్టానికి డాలరు

సాక్షి, ముంబై: బంగారం ధరలు  మరింత దిగి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆల్‌టైం గరిష్టంనుంచి క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్ప క్షీణతను నమోదు చేయగా వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. నేడు (మార్చి 31న) మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో, జూన్  ఫ్యూచర్స్‌  0.9 శాతం తగ్గి 10 గ్రాములకు 44,304 రూపాయల ట్రేడవుతున్నాయి. మే వెండి ఫ్యూచర్స్ 0.84 శాతం తగ్గి కిలోగ్రాము 62,595 వద్ద ట్రేడవుతున్నాయి. (నయా ట్రెండ్‌: కారు అలా కొనేస్తున్నారట!)

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలోకూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు 24 క్యారెట్ల పసిడి ధర రూ.380 తగ్గి,10 గ్రాములు రూ.45,110 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,350కి పడిపోయింది.  హైదరాబాద్ మార్కెట్‌లో వెండి కిలో ధర రూ.68,700 వద్ద మార్కెట్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.  అటు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,4400 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,490 వద్ద మార్కెట్ అవుతోంది.

రూ .44,300- 44,100  స్థాయిల వద్ద  బంగారానికి మద్దతు ఉంటుందని రూ .44,660-44,800 స్థాయిల వద్ద రెసిస్టెన్స్‌ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వెండికి 62,800-62,500 రూపాయల మద్దతు, 63,600-64,000 స్థాయిలలో ప్రతిఘటన ఉందని నిపుణులు అంటున్నారు. రూపాయిలో బలహీనత ఉన్నప్పటికీ,  వెండి బంగారం ధరలు బలహీనంగా  ఉన్నాయి. అటు  డాలర్ బలం పుంజుకుని నాలుగున్నర నెలల గరిష్ట స్థాయికి చేరుకుని 93 మార్కును దాటింది. అమెరికా బాండ్ దిగుబడి పుంజుకున్న​ నేపథ్యంలో రూపాయ నెల కనిష్టానికి  చేరింది.  భవిష్యత్తులో  మరింత పడిపోవచ్చని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా డాలర్లకు  డిమాండ్‌ బావుందని వ్యాపారులు భావిస్తున్నారు. (హోండా ప్రీమియం బైక్స్ : ధర ఎంతంటే)

అంతర్జాతీయ మార్కెట్లలోనూ బులియన్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి.  స్పాట్ బంగారం ధరల 0.1 శాతం తగ్గి ఔన్సుకు 1,683.56 డాలర్లకు చేరుకుంది. వెండి 24.01 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, ప్లాటినం 0.5 శాతం పెరిగి 1,160.05 డాలర్లకు, పల్లాడియం 0.7 శాతం పెరిగి 2,607.04 డాలర్లకు చేరుకుంది.  చైనాలో ఫ్యాక్టరీ కార్యకలాపాల  డేటా కారణంగా బంగారం రేట్లు మరింత పడిపోయాయని  రాయిటర్స్ తెలిపింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు  అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించిన మల్టీ ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు