వారం రోజుల పసిడి పరుగులకు బ్రేక్!

8 Jul, 2021 17:48 IST|Sakshi

జూలై 1 నుంచి పరిగెడుతున్న పసిడి పరుగులకు నేడు బ్రేక్ పడింది. ప్రపంచ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గడంతో భారతీయ మార్కెట్లలో వాటి ధరలు కూడా పడిపోయాయి. ఎంసీఎక్స్ లో, గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.3 శాతం పడిపోయి ₹47,776‎‎గా ఉంటే, వెండి రేట్లు 0.5 శాతం పడిపోయి కిలోకు ‎₹69,008గా ఉంది.‎‎ అమెరికాలో బంగారం 0.4% క్షీణించి $1,797కు పడిపోయింది. నేడు ఢిల్లీ బులియన్ జేవేల్లెరి మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.120 క్షీణించి రూ.47,815కు చేరుకుంటే, ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,908 నుంచి రూ.43,799కు పడిపోయింది.

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. స్వచ్చమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,710గా ఉంటే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650గా ఉంది. ఇక వెండి ధరలు మాత్రం బంగారం ధరలతో పాటే తగ్గాయి. నేడు ఒక కేజీ వెండి ధర రూ.68,285గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు వెండి ధర రూ.1,048 తగ్గింది. యుఎస్ ట్రెజరీ భయాలతో పాటు డెల్టా వేరియంట్ కొత్త వైరస్ కేసుల పెరుగుదలపై ఆందోళనలు కారణంగా బంగారం ధరలు ఔన్సుకు $1800 దగ్గర స్థిరంగా ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లోని రీసెర్చ్ హెడ్ కమాడిటీస్ హరీష్ వి చెప్పారు.‎

మరిన్ని వార్తలు