ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే?

20 Apr, 2021 16:56 IST|Sakshi

బంగారం ధరలు ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 19 వరకు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు ధర రూ.3,358 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల నగల తయారీ బంగారం 10 గ్రాములు ధర రూ.2,416 పెరిగింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం స్టాక్ మార్కెట్లు, కరోనా ప్రభావమే. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో చాలా మంది మదుపరులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. 

నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.రూ.47,555 నుంచి రూ.47,174కు తగ్గింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,560 నుంచి 43,211కు చేరుకుంది. అంటే ఒక్క రోజులో సుమారు రూ.350 తగ్గింది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.44,250నుంచి రూ.44,150కు చేరుకుంది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.48,270 నుంచి రూ.48,160కు తగ్గింది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.68,482 నుంచి రూ.68,608కు పెరిగింది.

చదవండి: సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్

మరిన్ని వార్తలు